ప్రభాస్ “రాధే శ్యామ్” టీజర్ తో ఆల్ టైమ్ రికార్డు!

Published on Oct 24, 2021 4:04 pm IST

ప్రభాస్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా రాధ కృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధే శ్యామ్. ఈ చిత్రం నుండి విక్రమాదిత్య ఇంట్రో వీడియో ను చిత్ర యూనిట్ టీజర్ పేరిట విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం టీజర్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల కావడం తో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవు. ఈ చిత్రం టీజర్ కోసం ఎప్పటినుండో ఎదురు చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా దాడి చేసినట్లు టీజర్ వ్యూస్ భారీగా రావడం జరిగింది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ అందుకున్న టీజర్ గా ఈ రాధే శ్యామ్ నిలవడం విశేషం.

టాలీవుడ్ లో 50 మిలియన్ వ్యూస్ ను అందుకోవడానికి అఖండ చిత్రం కి 16 రోజుల సమయం పట్టగా పుష్ప చిత్రానికి 20 రోజుల సమయం పట్టింది. ప్రస్తుతం 62 మిలియన్ కి పైగా వ్యూస్ తో టాప్ లో దూసుకు పోతుంది. సచిన్ ఖేదేకర్, ప్రియదర్శి పులికొండ, భాగ్య శ్రీ, జగపతి బాబు, మురళి శర్మ, కునాల్ రాయ్ కపూర్, రిద్ది కుమార్, శశ చెత్రి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని యూ వీ క్రియేషన్స్ మరియు టీ సిరీస్ పతాకం పై నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, చైనీస్, జపనీస్ భాషల్లో వచ్చే ఏడాది జనవరి 14 న విడుదల కానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More