“శ్యామ్ సింగరాయ్”కి 63 అడుగుల భారీ కటౌట్.. ఎక్కడంటే?

Published on Dec 22, 2021 12:35 am IST


న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా సందడి చేయనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

నాని హీరోగా నటించిన చివరి రెండు సినిమాలు వి, టక్ జగదీశ్ నేరుగా ఓటీటీలోనే విడుదలయ్యాయి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న “శ్యామ్ సింగరాయ్” కోసం నాని అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే “శ్యామ్ సింగరాయ్”కి భారీ కటౌట్‌ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి 70ంం థియేటర్ వద్ద 63 అడుగుల భారీ శ్యామ్ సింగరాయ్ కటౌట్‌ని నిలబెట్టారు. అంతేకాదు కటౌట్‌పై క్రాకర్లు పేల్చి పూల వర్షం కురిపించారు నాని అభిమానులు. చూడాలి మరీ నాని ఈ సినిమాతో ఏ మేరకు ఆకట్టుకుంటాడనేది.

సంబంధిత సమాచారం :