7.5 మిలియన్ వ్యూస్ తో టాప్ లో ట్రెండ్ అవుతోన్న “లవ్ స్టోరీ” ట్రైలర్

Published on Sep 16, 2021 10:25 pm IST

నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రం ఈ నెల 24 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి పతాకం పై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం పవన్ సి హెచ్ అందిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాటలు, వీడియో లు విడుదల అయి సినిమా పై ఆసక్తి రేపాయి. ఇటీవల విడుదల అయిన ట్రైలర్ సైతం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ 7.5 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ ట్రైలర్ యూ ట్యూబ్ లో టాప్ లో కొనసాగుతుండటం విశేషం. ఈ చిత్రం ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మాత్రమే కాకుండా, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ట్రైలర్ తోనే సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :