వాసివాడి తస్సాదియ్యా…టాప్ లో ట్రెండ్ అవుతోన్న బంగార్రాజు ట్రైలర్!

Published on Jan 12, 2022 11:30 am IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు 7 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాగా, యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం ను జనవరి 14 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :