7 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న గల్లీ రౌడీ ట్రైలర్!

Published on Sep 15, 2021 12:21 am IST


సందీప్ కిషన్ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్ గా జీ. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం గల్లీ రౌడీ. ఈ చిత్రం లో వైవా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ను కోనా ఫిల్మ్ కార్పొరేషన్ ఎంవీవీ సినిమాస్ తో కలిసి కోనా వెంకట్ మరియు ఎంవీవీ సత్యనారాయణ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు సినిమా పై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి. విడుదల అయిన ట్రైలర్ సైతం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజా గా ఈ ట్రైలర్ 7 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. యూ ట్యూబ్ లో 7 మిలియన్ వ్యూస్ ను సాధించడం మాత్రమే కాకుండా, 58 కే లైక్స్ ను సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల అయిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది. ఈ చిత్రం ను ఈ నెల 17 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి చౌరస్తా రామ్ మరియు సాయి కార్తీక్ లు సంగీతం అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :