మహా సముద్రం ట్రైలర్ కి 7 మిలియన్ వ్యూస్!

Published on Sep 27, 2021 12:03 am IST


శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మన్యూయేల్ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మహా సముద్రం. AK ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల కి సిద్దం అవుతుండటం తో చిత్ర యూనిట్ ఇటీవల ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ట్రైలర్ వైరల్ అవుతూ ఉండగా, యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ 7.1 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాక 200కే కి పైగా లైక్స్ ను సొంతం చేసుకోవడం జరిగింది.

జగపతి బాబు, రావు రమేష్, గరుడ రామ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్ అందిస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 14 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :