యూట్యూబ్ లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన “జయ జానకీ నాయక”

యూట్యూబ్ లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన “జయ జానకీ నాయక”

Published on Mar 28, 2023 11:43 PM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జయ జానకీ నాయక. ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం హిందీ లో జయ జానకీ నాయక ఖోంఖర్ పేరిట యూ ట్యూబ్ లో ఫిబ్రవరి 8, 2019 లో విడుదల అయ్యింది. అయితే ఈ చిత్రం యూ ట్యూబ్ లో ఆల్ టైమ్ రికార్డ్ ను క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకూ ఈ సినిమా 700 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఒక సినిమా 700 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.

రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ లేడీ లీడ్ రోల్స్ లో నటించగా, జగపతి బాబు, శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం హిందీ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం తో బెల్లంకొండ హిందీ సినిమా లోకి అడుగు పెడుతున్నారు. ఈ చిత్రం అక్కడ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు