70ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్ నుండి మరో సినిమా!

1st, January 2018 - 11:44:48 AM

70ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ మూడో సినిమాను అధికారికంగా ప్రకటించింది. గతంలో ఈ బ్యానర్లో సుధీర్ బాబు హీరోగా ‘భలే మంచి రోజు, ఆనందోబ్రహ్మ’ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల ద్వారా శ్రీరామ్ ఆదిత్య, మహి.వి రాఘవ్ లు దర్శకులుగా పరిచమయ్యారు.

తాజాగా ఈ సంస్థ అనౌన్స్ చేసిన సినిమాకు మహి.వి రాఘవ్ దర్శకుడు అవ్వడం విశేషం. 2017 లో ఈ దర్శకుడు తీసిన ‘ఆనందోబ్రహ్మ’ సినిమా మంచి విజయం సాదించింది. తాప్సి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీ సక్సెస్ కావడంతో అదే బ్యానర్లో అదే దర్శకుడితో మరో సినిమా రాబోతోంది. ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉంది.