నాటు నాటు మాస్ అంతెం కి 75 మిలియన్ వ్యూస్!

నాటు నాటు మాస్ అంతెం కి 75 మిలియన్ వ్యూస్!

Published on Nov 29, 2021 1:00 PM IST

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మాస్ అంతెం నాటు నాటు పాట కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాక యూ ట్యూబ్ లో ఈ పాట 75 మిలియన్స్ వ్యూస్ ను సాధించడం జరిగింది. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు