టాలీవుడ్ లో రీసెంట్ గా స్టార్ట్ అయ్యిన రీరిలీజ్ ట్రెండ్ లో వస్తున్న పలు చిత్రాల్లో యూత్ ఫుల్ కల్ట్ క్లాసిక్ చిత్రం “7/జి బృందావన్ కాలనీ” కూడా ఒకటి. మరి యంగ్ నటుడు రవికృష్ణ హీరోగా సోనియా అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో తెలుగు తమిళ్ లో కూడా పెద్ద హిట్ కాగా ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు రీ రిలీజ్ కి రాగా ఈ సినిమా మళ్ళీ అదే మ్యాజిక్ ని రిపీట్ చేసింది.
ఇప్పుడు మొదటి రోజు ఏకంగా ఒక కోటికి పైగా గ్రాస్ ని అయితే ఈ చిత్రం రాబట్టి అదరగొట్టింది. మరి 1.04 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ గా రెండో రోజు కూడా మంచి బుకింగ్స్ ని తెలుగు స్టేట్స్ లో రిజిస్టర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ చిత్రం మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వచ్చి కూడా అదే రెస్పాన్స్ ని అందుకుంది అని చెప్పాలి. మరి కల్ట్ హిట్ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ఏ ఎం రత్నం నిర్మాణం వహించారు.