బాహుబలికి కీలకం కానున్న 8 పాత్రలు

Baahubali-pposter
భారత చలన చిత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత భారీ బడ్జెట్ తో, అబ్భురపరిచే భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రతిష్టాత్మక మూవీ ‘బాహుబలి’. సక్సెస్ ని తన ఇంటిపేరుగా పరచుకున్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ కి మరొక్క రోజు మాత్రమే ఉంది. జూలై 10న అనగా రేపు అత్యధిక థియేటర్స్ లో నాలుగు భాషల్లో(తెలుగు, తమిళ, మలయాళ, హిందీ) రిలీజ్ కానుంది. ఫైనల్ కాపీ ఇప్పటికే అన్ని ప్రాంతాలకు చేరుకుంది. అలాగే ప్రతి చోటా ఈ సినిమా టికెట్స్ మరియు ప్రీమియర్స్ షోస్ టికెట్స్ భారీ రేటుకు అమ్ముడు పోతున్నాయి.

ఇక బాహుబలి సినిమా విషయానికి వస్తే.. రాజమౌళి సినిమా అంటే అందులో హీరో – విలన్ పాత్రలు అత్యంత బలంగా ఉంటాయి. అవసరం అయితే మరో రెండు పాత్రలకి కథలో ఎక్కువ బలం ఉంటుంది. కానీ మొదటి సారి రాజమౌళి 8 పాత్రలని బేస్ చేసుకొని, వారి చుట్టూ తిరిగే కథని బాహుబలి కోసం సిద్దం చేసాడు. ఈ సినిమాలో 8 పాత్రలు దేనికవే ప్రత్యేకం, ది బెస్ట్ అనిపించుకునేలా ఉంటాయని ఈ చిత్ర టీం అంటోంది. ఆ పాత్రలే బాహుబలి, శివుడు, భళ్లాలదేవ, శివగామి, అనామిక, దేవసేన, కట్టప్ప, బిజ్జలదేవ. ఈ 8 పాత్రలని ఆడియన్స్ అంత తొందరగా మరచిపోలేరని అంటున్నారు.

ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయగా రానా, తమన్నా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు.

Exit mobile version