కొనసాగుతున్న పుష్పరాజ్ వేట…ఫస్ట్ సింగిల్ కి 80 మిలియన్ వ్యూస్!

Published on Sep 28, 2021 12:15 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మీక మండన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం మొదటి పార్ట్ నుండి విడుదల అయిన గ్లింప్స్ మరియు ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

పుష్పరాజ్ అంటూ పవర్ ఫుల్ పాత్ర లో, ఊర మాస్ గా కనిపిస్తున్న అల్లు అర్జున్ ఫస్ట్ సింగిల్ అన్ని బాషల్లో కలిపి 80 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మళయాళ నటుడు ఫాహద్ ఈ చిత్రం లో కీలక పాత్ర లో నటిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :