ఉత్కంఠ సన్నివేశాలతో 83 టీజర్ విడుదల!

Published on Nov 26, 2021 11:36 am IST

రన్ వీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వం లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న తాజా చిత్రం 83. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యం లో 1983 లో టీమ్ ఇండియా వరల్డ్ కప్ ను తొలి సారిగా కైవసం చేసుకుంది. ఇందుకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల ఆధారం గా కపిల్ దేవ్ ఎదుర్కొన్న ఒడిదుడుకుల సమాహారం గా ఈ 83 చిత్రం ఉండనుంది. ఈ చిత్రం కోసం హీరో రన్ వీర్ సింగ్ ఎంతో కష్ట పడ్డారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ లో 1983 కి సంబంధించిన ఫైనల్ మ్యాచ్ సన్నివేశాలను చూపించడం జరిగింది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్, విబ్రి మీడియా, కే ఏ ప్రొడక్షన్స్, నదియావాల గ్రాండ్ సన్ ఎంటర్ టైన్మెంట్, కబీర్ ఖాన్ బ్యానర్ ల పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More