9 మిలియన్ వ్యూస్ తో వరుణ్ తేజ్ “గని” ట్రైలర్!

9 మిలియన్ వ్యూస్ తో వరుణ్ తేజ్ “గని” ట్రైలర్!

Published on Mar 22, 2022 10:09 PM IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం గని. అల్లు బాబీ కంపనీ మరియు రినైస్సన్స్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని అల్లు బాబీ మరియు సిద్దు ముద్ద లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో సాయి మంజ్రేకర్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటింస్తుంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో సినిమా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ 9 మిలియన్ ప్లస్ డిజిటల్ వ్యూస్ ను సాధించడం జరిగింది. వరుణ్ తేజ్ ఈ చిత్రం కోసం ఏ తరహాలో కష్ట పడ్డారు అనేది ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు