96 తెలుగు రీమేక్ షూటింగ్ అప్ డేట్స్ !

Published on Apr 30, 2019 3:16 pm IST

కోలీవుడ్ కల్ట్ మూవీ ’96’ తెలుగులో రీమేక్ అవుతుంది. ఈ రీమేక్ లో శర్వానంద్ , సమంత జంటగా నటిస్తుండగా ఈ చిత్రం యొక్క షూటింగ్ ఇటీవలే ప్రారంభమై మారిషస్ లో మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్ లో శర్వా ఫై ఇంట్రో సాంగ్ ను షూట్ చేశారు.

ఇక ప్రస్తుతం కెన్యా లో రెండవ షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటుంది. 15రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్లో శర్వా ఫై కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక ఈ షెడ్యూల్ తరువాత హైదరాబాద్ , వైజాగ్ లో షూటింగ్ చేయనున్నారు. దాంతో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఈ షెడ్యూల్లో సమంత కూడా పాల్గొననుంది.

ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి జాను అనే టైటిల్ ప్రచారం లో వుంది. గోవింద్ వసంత సంగీతం అందిస్తుండగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్ లో ఈ చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :