వాహ్..”అన్నాత్తే” నుంచి బ్యూటిఫుల్ నెంబర్.!

Published on Oct 8, 2021 12:00 pm IST

తలైవర్ రజినీకాంత్ హీరోగా స్టార్ దర్శకుడు శివ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “అన్నాత్తే”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమాతో రజినీ ఖచ్చితంగా అదిరే కం బ్యాక్ ఇస్తారని అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి అప్డేట్స్ కూడ మేకర్స్ వరుసపెట్టి వదులుతున్నారు.

అలా కొన్ని రోజులు కితమే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ లెజెండరీ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాడిన పాటను రిలీజ్ చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఈసారి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని లాంచ్ చెయ్యబోతున్నారు. రజినీ మరియు నయన్ ల మధ్య సాంగ్ ఇది.

స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ అలాగే శ్రేయా గోషల్ లు ఈ సాంగ్ ని ఆలపించారు అంటే ఆల్రెడీ ఇది హిట్ ట్రాక్ అని అర్ధం. ఇంకా దీనిపై రిలీజ్ చేసిన పోస్టర్ ని చూస్తే వాహ్ అనాల్సిందే.. మొత్తానికి మాత్రం ఈ సాంగ్ ఏదో బాగానే ఉండేలా ఉంది. దీని కోసం అయితే రేపు సాయంత్రం 6 గంటలు వరకు ఆగాల్సిందే. మరి ఈ సినిమాకి డి ఇమాన్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :