టాక్..”రాధే శ్యామ్” నుంచి ఓ బ్యూటిఫుల్ అప్డేట్ రాబోతోందా?

Published on Dec 28, 2021 10:00 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన లేటెస్ట్ అండ్ భారీ సినిమా “రాధే శ్యామ్”. అవ్వడానికి క్లాస్ సినిమానే అయినా ఈ సినిమా కోసం పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ఒక అద్భుతమైన అనుభూతిని ప్రతి ఒక్కరికీ ఇచ్చింది.

మరి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి కూడా భారీ రెస్పాన్స్ రాగా మరికొన్ని రోజుల్లో ఈ సినిమా నుంచి బ్యూటిఫుల్ అప్డేట్ రాబోతున్నట్టు తెలుస్తుంది. అది కూడా ఈ సినిమాలో ఇంకో కీలకమైన సాంగ్ కోసం అట. అలాగే ఇది రాధే శ్యామ్ టైటిల్ సాంగ్ అని కూడా టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందివ్వగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :