గెట్ రెడీ..బన్నీ నుంచి ఓ బిగ్ అనౌన్సమెంట్..!

Published on Nov 26, 2021 9:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు తన ఫస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ “పుష్ప” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో అల్లు అర్జున్ నుంచి ఓ బిగ్ అనౌన్సమెంట్ రాబోతున్నట్టుగా బన్నీ దగ్గర వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇది సినిమా కోసం కాదట.

మరి సినిమా కోసం కూడా కాదు కానీ ఏదో పెద్ద అనౌన్సమెంట్ అంటున్నారు కాబట్టి ఓటిటి దో లేక తాను స్పెషల్ గా చేస్తున్న వర్క్ ఏదన్నా అయ్యి ఉండొచ్చు. మొత్తానికి మాత్రం బన్నీ నుంచి వచ్చే ఈ క్రేజీ అనౌన్సమెంట్ ఏంటి అనే చర్చ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ ల కాంబోలో చేసిన “పుష్ప” డిసెంబర్ 17 రిలీజ్ కి సన్నాహాలులో మేకర్స్ బిజీ బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More