టాక్.. “గేమ్ ఛేంజర్” నుంచి బిగ్ అనౌన్స్మెంట్!?

టాక్.. “గేమ్ ఛేంజర్” నుంచి బిగ్ అనౌన్స్మెంట్!?

Published on Jun 16, 2024 12:06 PM IST


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అంజలి అలాగే కియారా అద్వానీ (KIara Advani) హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ షేప్ అవుట్ చేస్తున్న అవైటెడ్ భారీ చిత్రం “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు టాలీవుడ్ లో మారుతున్నా పరిస్థితులతో రిలీజ్ డేట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

చరణ్ తో ఉన్న ప్రతి టాప్ హీరో సినిమాల రిలీజ్ డేట్ లు కూడా క్లారిటీ వచ్చేసాయి. అంతెందుకు తన RRR కో స్టార్ ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న “దేవర” (Devara) చరణ్ సినిమా కంటే ఎంతో ఆలస్యంగా మొదలైనప్పటికీ అప్పుడే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేసుకొని వచ్చేస్తుంది. కానీ ఇంకా గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడు అనేది ఎవరికీ క్లారిటీ లేదు.

అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ బిగ్ అప్డేట్ అతి త్వరలోనే మేకర్స్ రివీల్ చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. ఇక దీనిపై అఫీషియల్ క్లారిటీ త్వరలోనే రానుంది. ప్రస్తుతానికి ఈ చిత్రం అక్టోబర్ లేదా డిసెంబర్ రిలీజ్ అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు