యూఎస్ ఆడియెన్స్ కోసం “RRR” నుంచి ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్.!

Published on Mar 12, 2022 8:36 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి తీసిన భారీ పాన్ ఇండియా మరియు ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ కమ్ మల్టీస్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. తారా స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం ఇప్పటికే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర అయితే వండర్స్ నమోదు చేస్తుంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి సరిగమ సినిమాస్ వారు లేటెస్ట్ గా ఒక క్రేజీ పోస్ట్ పెట్టారు. యూఎస్ ఆడియెన్స్ కోసం రేపు ఒక ఎగ్జైటింగ్ అనౌన్సమెంట్ తమ నుంచి మరియు రాఫ్తార్ వారి నుంచి రాబోతుంది అని ఇది ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కూడా అచీవ్ చెయ్యనటువంటిది అని హైప్ ఎక్కిస్తూ ఈ బిగ్ అనౌన్సమెంట్ చేశారు. మరి ఇదేంటో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :