లేటెస్ట్..”అఖండ” నుంచి బిగ్గెస్ట్ అప్డేట్ కి రంగం సిద్ధం.!

Published on Nov 13, 2021 1:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “అఖండ”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే అధిక వ్యయంతో తెరకెక్కి అంతే స్థాయిలో బజ్ తో రెడీ అవుతుంది.

అయితే ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యిపోయిన ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో చిత్ర యూనిట్ ద్వారకా క్రియేషన్స్ వారు ఓ బిగ్గెస్ట్ అప్డేట్ ని ఈరోజు సాయంత్రం 4 గంటలకి రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అయితే ఇది ట్రైలర్ కోసమా లేక ట్రైలర్ తో కలిపి రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ కోసమా అన్నది తెలియాల్సింది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఆ అప్డేట్ కోసం ఎదురు చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :