అఖిల్ “ఏజెంట్” నుంచి బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

Published on Mar 11, 2022 4:20 pm IST


అక్కినేని వారి యంగ్ హీరో తన కెరీర్ లోనే ఏ సినిమాకి కూడా లేని విధంగా సాలిడ్ పర్సనాలిటీ ని బిల్డ్ చేసి చేస్తున్న లేటెస్ట్ సినిమా “ఏజెంట్”. స్టైలిష్ అండ్ మాస్ సినిమాల స్పెషలిస్ట్ అయినటువంటి దర్శకుడు సురేందర్ రెడ్డి భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో టాలీవుడ్ నుంచి ఒక సాలిడ్ స్పై థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు ఆసక్తికర అప్డేట్స్ ఇస్తూ వస్తున్న మేకర్స్ ఇప్పుడు ఓ బ్లాస్టింగ్ అప్డేట్ ని ఓ సాలిడ్ పోస్టర్ తో అందించారు. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది ఆగష్టు 12న రిలీజ్ చేస్తున్నట్టు ఇపుడు అనౌన్స్ చేశారు. మరి ఈ అనౌన్సమెంట్ పోస్టర్ ని గనుక చూసుకున్నట్టయితే.

ఒక భీకర యాక్షన్ సీక్వెన్స్ ని పూర్తి చేసాక రిలీఫ్ ని ఫీల్ అవుతున్న యాటిట్యూడ్ తో స్టన్నింగ్ లుక్ లో అఖిల్ కనిపిస్తున్నాడు. మొత్తానికి అయితే మంచి అంచనాలు నెలకొల్పుకుంటూ వెళ్తున్న ఈ చిత్రం ఫైనల్ గా రిలీజ్ డేట్ ని తెచ్చేసుకుంది. ఇక ఈ చిత్రానికి ‘ధృవ’ ఫేమ్ హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా రీసెంట్ గానే మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

సంబంధిత సమాచారం :