మెగాస్టార్, బాబీ కాంబో నుంచి బ్లాస్టింగ్ అప్డేట్.!

Published on Aug 21, 2021 5:12 pm IST


మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుక గా డే అప్డేట్స్ రానున్నాయని ఈరోజు ఉదయమే తెలిపాము. మరి దానిని నిజం చేస్తూ మెగాస్టార్ ప్రస్తుతం చేస్తున్న “ఆచార్య” సహా మిగతా అన్ని సాలిడ్ ప్రాజెక్ట్స్ నుంచి అదిరే అప్డేట్స్ ని ఇస్తూ వస్తున్నారు. మరి ఉదయం నుంచి మెగాస్టార్ నెక్స్ట్ సినిమాలు 153, 54 అన్ని సినిమాలు నుంచి కూడా అప్డేట్స్ వచ్చాయి మరి వీటిలో దర్శకుడు బాబీ తో ప్లాన్ చేసిన బిగ్ ప్రాజెక్ట్ పై కూడా అప్డేట్ ని ఇచ్చారు.

మెగా వేవ్ అంటూ ఆసక్తికర పోస్టర్ ని డిజైన్ చేసి చూపించారు. దీనిని బట్టి మెగాస్టార్ ప్రతి సినిమా విషయంలో ఎంత స్పీడ్ వర్క్ కనబరుస్తున్నారో అర్ధం అయ్యింది. మరి ఇదిలా ఉండగా ఈ పోస్టర్ మరిన్ని అంచనాలు రేకెత్తిస్తుండగా మైత్రి మోవి మేకర్స్ బ్యానర్ లో ఈ చిత్రం నిర్మాణం జరగనుంది. అలాగే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. అలాగే రేపు సాయంత్రం మెగాస్టార్ బర్త్ డే కానుకగా 4 గంటల 5 నిమిషాలకు మరో అదిరే అప్డేట్ ఇస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :