“పుష్ప” నుంచి బ్లాస్టింగ్ అప్డేట్ రాబోతోందా.?

Published on Aug 1, 2021 9:38 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప” పై ఎన్ని అంచనాలు ఉన్నాయో తెలిసిందే. పాన్ ఇండియన్ లెవెల్లో భారీ అంచనాలు నెలకొల్పుకొని సిద్ధం అవుతున్న ఈ చిత్రం పై ఇటీవలే బన్నీ వర్గాల నుంచి కాస్త ఆసక్తికరమైన సూచనలే వస్తున్నాయి.

అయితే ఇప్పుడు తాజా టాక్ ప్రకారం ఈ చిత్రం నుంచి బహుశా ఈ కొద్ది రోజుల్లోనే లేదా రేపు అలా ఒక సాలిడ్ అప్డేట్ రాబోతున్నట్టు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. మరి ఆ అప్డేట్ ఈ సినిమా ఆడియో పైనే ఏమో అన్నది మరింత ఆసక్తికరంగా ముఖ్యంగా ఇటీవలే ఈ సినిమా ఆల్బమ్ కూడా అదిరే రేంజ్ లో వచ్చింది అని తెలిసింది.

రేపు దేవిశ్రీ ప్రసాద్ బర్త్ డే కావున మరి మ్యూజికల్ గా ఏదన్నా బ్లాస్టింగ్ అప్డేట్ వస్తుందేమో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :