“మహేష్ 28” పై అదిరే బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

Published on Jul 9, 2022 11:46 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు తన హ్యాట్రిక్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ భారీ సినిమా చెయ్యడానికి సిద్ధం అయ్యిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ అతి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనుండగా ఇప్పుడు మేకర్స్ ఓ బ్లాస్టింగ్ అప్డేట్ ని అందించారు.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ కాగా షూటింగ్ ని ఈ ఆగష్టు నుంచి స్టార్ట్ చేస్తున్నామని అధికారికంగా అనౌన్స్ చేసారు. ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కట్ తో ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారో కూడా అనౌన్స్ చేసేసారు.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి బరిలో దింపుతున్నట్టుగా బ్లాస్టింగ్ అప్డేట్ ని అందించారు. దీనితో ఇప్పుడు మహేష్ మరియు త్రివిక్రమ్ సినిమా కోసం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ చిత్రానికి థమన్ కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేయగా హారికా హాసిని వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :