“బిగ్ బాస్ 5” గెస్ట్స్ పై వైరల్ అవుతున్న బజ్..!

Published on Dec 15, 2021 5:55 pm IST


ఇప్పుడు మన తెలుగు స్మాల్ స్క్రీన్ కి చెందిన బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్స్ కి వచ్చేసింది. ఇక ఈ వారంలోకి ఎంటర్ అవ్వడంతోనే ఫినాలే రచ్చ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న ఈ గ్రాండ్ ఈవెంట్ ఫినాలే పై ఇప్పుడు పలు ఆసక్తికర ఊహాగానాలే వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి గాను మేకర్స్ సాలిడ్ ప్లానింగులే వేస్తున్నారట. ఒక ఊహించని అతిథితో లేదా అథితిధులే ఈ గ్రాండ్ ఫినాలేకి హాజరు అయ్యి వారితో టైటిల్ విన్నర్ ని ప్రకటించడం చేస్తారని నయా టాక్. మరి అది రిలీజ్ కి రెడీగా ఉన్న “RRR” యూనిట్ తో కూడా కావచ్చని వైరల్ అవుతున్న టాక్.

మరి ఈ సినిమా హీరోల్లో ఎవరు గెస్ట్ గా వస్తారు ఇద్దరూ వస్తారా లేదా అనే వాటిపై కూడా ఇంకా గాసిప్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇంకా అయితే ఏదీ ఫైనల్ కానట్టు తెలుస్తుంది. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :