“అఖండ” ఓటిటి రిలీజ్ పై క్లారిటీ ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే.!

Published on Dec 24, 2021 3:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన మాస్ అండ్ హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ “అఖండ” ఈ ఏడాది భారీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. బాక్సాఫీస్ పరంగా సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా ఇప్పటికీ కూడా డీసెంట్ హోల్డ్ కనబరుస్తూ ఈ చిత్రం థియేటర్స్ లో కొనసాగుతుంది. ఇక ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై ఇప్పుడు ఒక క్లారిటీ బయటకి వచ్చింది.

ఈ చిత్రాన్ని మేకర్స్ జనవరి నెలలో స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అలాగే బహుశా ఈ చిత్రం జనవరిలో సంక్రాంతి కానుకగా డిజిటల్ ప్రీమియర్ గా స్ట్రీమింగ్ కి రానున్నట్టు తెలుస్తుంది. మరి వచ్చేది అప్పుడేనా కాదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే జనవరిలోనే స్ట్రీమింగ్ అయితే కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ డేట్ పై కూడా క్లారిటీ వస్తే బాలయ్య ట్రీట్ ఓటిటి లో కూడా దద్దరిల్లడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :