“భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ గెస్టులపై క్లారిటీ..!

Published on Feb 19, 2022 11:00 am IST

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ సహా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది “భీమ్లా నాయక్” సినిమానే అని చెప్పాలి. ఒక్కసారిగా భారీ హైప్ ని తెచ్చుకున్న ఈ చిత్రం రిలీజ్ పై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.

ఇలా తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా అదిరే బుకింగ్స్ అందుకుంటున్న ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ కి ఇంకా తక్కువ సమయమే మిగిలి ఉండడంతో ఈ గ్యాప్ లో ట్రైలర్, ప్రీ రిలీజ్ వేడుకలకి సంబంధించి పలు ఊహాగానాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి సంబంధించి అయితే అనేక మంది స్టార్ హీరోల పేర్లే వినిపిస్తున్నాయి కానీ అసలు క్లారిటీ ఏమిటంటే ఈ ఈవెంట్ కి ఏ బిగ్ స్టార్ కూడా హాజరు కావడం లేదట.. కేవలం చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఉంటారని తెలుస్తుంది. అలాగే ఈ ఈవెంట్ డేట్ కూడా త్వరలోనే అనౌన్స్ కానున్నట్టు మరో టాక్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :