కృష్ణం రాజు గారి ఆరోగ్య వార్తలపై క్లారిటీ ఇదే.!

Published on Sep 14, 2021 1:00 pm IST

తెలుగు సినిమా నాట ఉన్న ఎందరో అగ్ర గామి సీనియర్ నటుల్లో రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు కూడా ఒకరు. ఎన్నో చిత్రాల్లో నటించి ఇప్పటికీ కూడా నటిస్తున్న ఆయనపై తాజాగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. తన ఆరోగ్యంపై పలు వార్తలు వైరల్ అవుతుండగా వాటికి ఇప్పుడు ఒక అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. కృష్ణం రాజు గారు కేవలం అపోలోకి జెనరల్ హెల్త్ చెకప్ కోసమే వచ్చారని వేరే ఇతర కారణాలు లేవని క్లారిటీ ఇచ్చారు.

అంతే కాకుండా ఇదే హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితులు కోసం కూడా ఆయన కనుక్కున్నారని త్వరలోనే తేజ్ ఆరోగ్యంతో తిరిగి బయటకి వస్తాడని వారి యోగక్షేమాల కోసం తేజ్ తల్లిదండ్రులతో చర్చించడం జరిగినట్టు తెలుస్తుంది. మరి ప్రస్తుతం కృష్ణం రాజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన భారీ చిత్రం “రాధే శ్యామ్” లో కూడా కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :