“ఎన్టీఆర్ 30” టైటిల్ పై అసలు క్లారిటీ ఇదే.!

“ఎన్టీఆర్ 30” టైటిల్ పై అసలు క్లారిటీ ఇదే.!

Published on Nov 12, 2022 5:44 PM IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు కొరటాల శివతో తారక్ చేస్తున్న రెండో సినిమా ఇది కాగా అలాగే ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా తెరకెక్కనుంది. ఇక ఈ చిత్రం పై అయితే పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఈ చిత్రం సెట్ చెయ్యగా ఈ సినిమా పై అయితే లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారింది.

మరి మేకర్స్ అయితే ఈ చిత్రానికి ఓ పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసారని ఓ టాక్ బయటకొచ్చి వైరల్ అవుతుండగా ఈ టైటిల్ పై అయితే ఇప్పుడు క్లారిటీ తెలుస్తుంది. ప్రస్తుతం ఈ టైటిల్ ఫిక్స్ అయ్యింది అనే మాట అవాస్తవం అని ఇంకా ఎలాంటి టైటిల్ ని కూడా మేకర్స్ అయితే ఫిక్స్ చెయ్యలేదని సినీ వర్గాల నుంచి లేటెస్ట్ గా వచ్చిన సమాచారం. సో ఈ రూమర్స్ లో అయితే ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధా ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు