ఈ విలక్షణ దర్శకునితో ఎన్టీఆర్ సినిమాపై క్లారిటీ?

Published on Jun 19, 2022 10:00 am IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ దర్శకుడు కొరటాల శివతో మళ్ళీ తన కెరీర్ లో రెండో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా భారీ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అనేక అంచనాలు ఇప్పటి నుంచే నెలకొల్పుకుంది.

అయితే ఈ చిత్రం అనంతరం మరింత సాలిడ్ లైనప్ ని సెట్ చేసుకున్న ఎన్టీఆర్ ఈ లైనప్ లో తమిళ్ కి చెందిన స్టార్ అండ్ విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ తో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్టుగా టాక్ వైరల్ గా మారింది. వెట్రిమారన్ ఎన్టీఆర్ కి ఒక కథని చెప్పగా ఎన్టీఆర్ దానికి ఓకే చెప్పాడని టాక్ మొదలైంది.

అయితే ప్రస్తుతానికి ఈ టాక్ లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. బుచ్చిబాబు తో వరకు ఎన్టీఆర్ లైనప్ లాక్ అయ్యింది కానీ వెట్రిమారన్ తో ప్రాజెక్ట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ కాంబోపై నిజం లేదనే తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :