“భవదీయుడు భగత్ సింగ్” పై అదిరే క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.!

Published on May 21, 2022 7:02 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్నా సంగతి అందరికీ తెలిసిందే. మరి వాటిలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో “హరిహర వీరమల్లు” అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఒకటి చేస్తుండగా దాని తర్వాత తన హిట్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో మోస్ట్ అవైటెడ్ “భవదీయుడు భగత్ సింగ్” అనే మరో స్ట్రెయిట్ ప్రాజెక్ట్ ని చేస్తున్నాడు. అయితే ఈ వీటిలో వీరమల్లు వరకు పవన్ పోషించే పాత్రపై అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.

అలాగే హరీష్ తో సినిమాపై మొదటి నుంచి ఒక టాక్ ఉంది. ఇప్పుడు దాన్ని అయితే దర్శకుడు హరీష్ శంకర్ రివీల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ ఒక ప్రొఫెసర్ గానే కనిపిస్తారని ఈ రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలిపారు. దీనితో ఈ సినిమాలో అయితే పవన్ రోల్ పై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసినట్టే అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో పవన్ సరసన పూజా హెగ్డే నటించనుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :