టాక్..”పుష్ప” రాజ్ వేడుకకి గెస్ట్ పై క్లారిటీ.?

Published on Dec 1, 2021 2:01 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పార్ట్ 1 ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతూ ఫైనల్ షూట్ కి కూడా సన్నద్ధం అయ్యింది.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ కి సంబంధించి కొన్ని రోజులు నుంచి ఓ టాక్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి స్పెషల్ గెస్ట్ గా పలువురు బిగ్ స్టార్స్ పేర్లే వినిపించాయి కానీ లేటెస్ట్ గా ఇంకో టాక్ ఏమిటంటే పుష్ప వేడుకకి ఏ గెస్ట్ ని పిలవబోవడం లేదట.

అయితే ఇది తెలుగు వెర్షన్ వరకూ మాత్రం అని తెలుస్తుంది. లాస్ట్ టైం లానే ఈసారి కూడా సోలో ప్రీ రిలీజ్ నే ఉంటుందట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :