“పుష్ప” ఓటిటి రిలీజ్ రూమర్స్ పై సాలిడ్ క్లారిటీ.!

Published on Dec 28, 2021 4:45 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ మోస్ట్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “పుష్ప”. అనుకున్న విధంగానే థియేటర్స్ లో సాలిడ్ రన్ కనబరుస్తున్న పుష్ప అన్ని భాషల్లో కూడా విశేష ఆదరణ అందుకుంటున్నాడు.

అయితే థియేటర్స్ లో ఇంకా నిలకడ కనబరుస్తున్న ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కి సంబంధించి కొన్ని గాసిప్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న అమేజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ జనవరి మొదటి వారంలోనే సినిమాని స్ట్రీమింగ్ కి తెచ్చేస్తారని ఓ టాక్ వినిపిస్తుంది.

అయితే దీనిపై క్లారిటీ ఏమిటంటే అసలు ఇందులో ఎలాంటి నిజం లేదట. మేకర్స్ ఈ చిత్రాన్ని ఇప్పుడప్పుడే ఓటిటి లో రిలీజ్ చేసే యోచనలో లేరట. బహుశా జనవరి నెల తర్వాతే అందుబాటులోకి రావొచ్చు ఏమో కానీ త్వరగా అయితే వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :