“సర్కారు వారి పాట” వాయిదాపై క్లారిటీ ఇదే..!

Published on Dec 11, 2021 12:01 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసేసుకుంది. అయితే ఈ చిత్రం పై గత కొన్ని రోజులు నుంచి ఓ షాకింగ్ రూమర్ వైరల్ అవుతుంది.

ఆల్రెడీ సంక్రాంతి బరిలోనుంచి వాయిదా పడిన ఈ చిత్రం మళ్ళీ ఏప్రిల్ 1 రిలీజ్ డేట్ నుంచి కూడా వాయిదా పడిందని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు దీనిపై ఒక క్లారిటీ తెలుస్తుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదట.

ఆన్ టైం సినిమా ల్యాండ్ అవుతుందని టాక్. మరి దీనిపై ఓ అధికారిక క్లారిటీ వస్తే మొత్తం అంతా సెటిల్ అవుతుందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :