విక్రమ్ భారీ సినిమా ఓటిటి రిలీజ్ పై క్లారిటీ.!

Published on Jan 2, 2022 6:48 pm IST


ఇండియన్ సినిమా దగ్గర నటన కోసం తమని తాము ఎంతైనా కష్టపెట్టుకునే అతి తక్కువ హీరోల్లో ‘చియాన్’ విక్రమ్ కూడా ఒకరు. ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ ఆశ్చర్యపరిచే విక్రమ్ లేటెస్ట్ గా చేస్తున్న భారీ చిత్రం “కోబ్రా”. అజయ్ జ్ఞ్యాన ముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ ఏకంగా 20 గెటప్స్ వేస్తున్నాడని టాక్ ఉంది.

మరి వాటిని నిజం చేస్తూ వచ్చిన టీజర్ కి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి షూటింగ్ అంతిమ దశలో ఉన్న ఈ సినిమా ఓటిటి రిలీజ్ అంటూ పలు ఊహాగానాలు వైరల్ కాగా వాటిపై క్లారిటీ తెలుస్తుంది. ఈ సినిమా ఓటిటి లో రిలీజ్ అవుతుంది అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇది థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ చేసే సినిమాని అని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

కొంచెం లేట్ అయినా థియేటర్స్ లోనే ఈ సినిమా రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక ఈ సినిమాలో ప్రముఖ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్ గా నటిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :