టాక్..”రాధే శ్యామ్” పై ఓ సరైన క్లారిటీ అప్పుడు రానుందా.?

Published on Jan 2, 2022 7:04 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన తాజా సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఒక అద్భుతమైన వింటేజ్ లవ్ స్టొరీ గా ఈ సినిమాని దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించారు. అయితే ఇదిలా ఉండగా సడెన్ గా ఈ కొత్త సంవత్సరం స్టార్టింగ్ లోనే ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి.

మళ్లీ కరోనా కేసులు పెరగడం తో ఆల్రెడీ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” వాయిదా పడగా రాధే శ్యామ్ మాత్రం ఇంకా జనవరి 14 కే స్టిక్ అయ్యి ఉంది. మరి ఇది ఎంత వరకు నిలకడగా ఉంటుంది అనే దానిపైనే లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తోంది. ప్రస్తుతం మేకర్స్ అయితే జనవరి 14కే సినిమాని తీసుకురావాలని చూస్తున్నారట.

కానీ ఇది డిసైడ్ అయ్యేది ఈ జనవరి 5 తర్వాత అని తెలుస్తోంది. అప్పటికి కానీ భారతదేశం లో పరిస్థితి నిలకడగా ఉంటే కనుక సినిమా రిలీజ్ ని కన్ఫర్మ్ చేసుకొని మిగతా పనులు స్టార్ట్ చేస్తారట. లేకపోతే ఇది కూడా వాయిదానే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మాత్రం ఈ సంక్రాంతి కి ఏదో ఒక పెద్ద సినిమా చూడాలని ఆడియెన్స్ కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :