జూలైలో స్టార్ హీరోల సమరం.!

prabash_baahubali1
ప్రతి వారం బాక్స్ ఆఫీసు వద్ద ఒకటి, రెండు లేదా మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి పోటీపడుతూ ఉంటాయి. కానీ చాలా అరుదుగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అవ్వడం, ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్కడలేని అంచనాలను క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకోనుంది. ఇద్దరు స్టార్ హీరోలు, అలాగే తెలుగు ప్రేక్షకులు మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలు రెండూ ఒక వారంలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – ఎస్ఎస్ రాజమౌళి కలిసి గత రెండున్నర సంవత్సరాలుగా చేస్తున్న సినిమా ‘బాహుబలి’. తెలుగు ప్రేక్షకులతో పాటు, ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న ఈ సినిమాని జూలై 10న రిలీజ్ చెయ్యాలని ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘శ్రీమంతుడు'(వర్కింగ్ టైటిల్). ఈ సినిమాపై కూడా టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని జూలై 17న రిలీజ్ చెయ్యాలని ఎప్పుడో రిలీజ్ డేట్ ని లాక్ చేసారు. ఇదే ప్రకారం సినిమాలు రిలీజ్ అయితే ఒకే వారం గ్యాప్ లో రెండు భారీ బడ్జెట్ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ కోసం గట్టిగా పోటీ పడతాయి.

రెండు సినిమాల జోనర్స్ వేరు వేరు అయినా స్టార్ హీరోస్ కావడం వలన రెండు సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి బాక్స్ ఆఫీసు పై దండయాత్ర చేసి ఎవరి సత్తా ఏమిటని చూసుకుంటారా.? లేక ఒకరికోసం ఒకరు అన్నట్టు ఎవరన్నా ఒకరు వెనక్కి వెళతారా అన్నది కాలమే నిర్ణయించాలి.

Exit mobile version