వైరల్ గా మారిన “RRR” లో చరణ్ పై డిలీట్ సీన్ కాన్సెప్ట్ పోస్టర్.!

Published on Jun 22, 2022 9:03 am IST

లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” చిత్రం ఓటిటి లో రిలీజ్ అయ్యాక మాత్రం పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శకుడు రాజమౌళి తీసిన ఈ హిస్టారికల్ బ్లాక్ బస్టర్ ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటుంది. అయితే ఈ చిత్రంలో చరణ్ సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా చరణ్ చేసిన రామరాజు పాత్రపై ఓ ఆసక్తిగొలిపే కాన్సెప్ట్ పోస్టర్ సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. రామరాజు పుట్టిన తర్వాత అగ్నిహోమం బ్యాక్గ్రౌండ్ లో ఓ ఋషి నుంచి ఆశీస్సులు పొందుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఆ సీన్ తాలూకా కాన్సెప్ట్ పోస్టర్ అంటూ సోషల్ మీడియాలో కాస్త గట్టిగానే వైరల్ గా మారింది. మరి ఇది కూడా సినిమాలో ఉండి ఉంటే చరణ్ పాత్రకి మరింత హైప్ గా ఉండేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :