“ఆచార్య” నుంచి క్రేజీ అనౌన్స్మెంట్ రాబోతోందా.?

Published on Apr 22, 2022 9:00 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఆల్రెడీ సెన్సార్ ని కూడా పూర్తి చేసుకున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అనౌన్సమెంట్ రావొచ్చని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది.

అది కూడా ఈ సినిమా స్పెషల్ గెస్ట్ కోసం అన్నట్టు వినికిడి. అయితే ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావొచ్చు అనే టాక్ ఉంది కానీ పవన్ కి తన పార్టీ నుంచి వేరే పని ఉండడంతో అది నిజం కాదని తేలిపోయింది. మరి ఆ లోటును మరో బిగ్ స్టార్ తీర్చే అవకాశం ఉన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఆ క్రేజీ అప్డేట్ వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :