క్రేజీ..ఆసియా కంట్రీస్ లో “బ్రో” ర్యాంపేజ్.!

Published on Sep 8, 2023 10:16 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన లేటెస్ట్ డివోషనల్ ఎంటర్టైనర్ చిత్రం “బ్రో ది అవతార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం థియేటర్స్ రిలీజ్ తర్వాత దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. మరి వచ్చిన తర్వాత ఇండియా సహా గ్లోబల్ గా కూడా ట్రెండింగ్ లోకి వచ్చింది.

మరి లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం మన ఆసియన్ కంట్రీస్ లో ర్యాంపేజ్ రెస్పాన్స్ ని కొనసాగిస్తుంది. మరి ఇండియా వైడ్ తెలుగు సహా హిందీ వెర్షన్ లో టాప్ 1 అండ్ 3 స్థానాల్లో ట్రెండ్ అవుతుండగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ లలో టాప్ 1 ప్లేస్ లో హిందీ వెర్షన్ నుంచి ట్రెండ్ అవుతుందట. అలాగే మాల్దీవ్స్ సహా మరిన్ని కంట్రీస్ లో ఈ చిత్రం హిందీ వెర్షన్ నుంచి టాప్ 10 లో ట్రెండ్ అవుతుంది. మొత్తానికి అయితే ఓటిటి లో బ్రో కి భారీ రెస్పాన్స్ నమోదు అయ్యింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :