లేటెస్ట్ : “సలార్” ఎక్స్ క్లూజివ్ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్డేట్.!

Published on Sep 22, 2023 12:24 pm IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ కానీ ప్రభాస్ ఫ్యాన్స్ గాని నెక్స్ట్ లెవెల్లో అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రం రిలీజ్ ని మేకర్స్ రీసెంట్ గానే అధికారికంగా వాయిదా వేశారు. దీనితో నెక్స్ట్ డేట్ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారగా ఈ డేట్ సంబంధించి ఓ క్రేజీ డీటెయిల్ అయితే తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ వారు అందించారు.

తమ యూట్యూబ్ ఛానెల్లో అయితే రీసెంట్ గా వాట్సాప్ లో వచ్చిన సరికొత్త అప్డేట్ వాట్సాప్ ఛానెల్స్ లో తమ వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి అందులో ఎక్స్ క్లూజివ్ గా అయితే అతి త్వరలోనే రిలీజ్ డేట్ పై అప్డేట్ అందిస్తామని తెలియజేసారు. మరి ఈ సంబంధింత లింకులు అయితే వారి యూట్యూబ్ ఛానెల్ కమ్యూనిటీలో ఉన్నాయి. వాటితో ఆల్రెడీ సలార్ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ జాయిన్ అవ్వడం కూడా స్టార్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :