లేటెస్ట్..”RRR” స్ట్రీమింగ్ కి డేట్ ఫైనల్ అయ్యిపోయిందా.!

Published on May 5, 2022 8:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ ఇండియన్ మల్టీ స్టారర్ మరియు భారీ బ్లాక్ బస్టర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు నమోదు చేసి వచ్చిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వసూళ్లను అందుకొని బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డ్స్ నమోదు చేసింది.

అయితే ఇప్పటికీ కూడా థియేటర్స్ లో ఈ సినిమా మంచి రన్ నే కొనసాగిస్తున్నా ఓటిటి రిలీజ్ పై మాత్రం ఇప్పుడు ఆల్ మోస్ట్ ఒక ఫైనల్ క్లారిటీ వచ్చేసినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ స్ట్రాంగ్ బజ్ ప్రకారం అయితే ఈ సినిమా ఓటిటి లో ఈ మే 20 నుంచే అన్ని భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక దీనిపై అయితే అధికారిక అప్డేట్ రావడమే తరువాయి అని చెప్పాలి. అలాగే ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులను జీ 5 వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :