రామ్ చరణ్, ఉపాసన పై ఫన్ పిక్ వైరల్.!

Published on Mar 8, 2023 8:00 am IST

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాను నటించిన గత చిత్రం “రౌద్రం రణం రుధిరం” చిత్రం ప్రపంచ ప్రఖ్యాత అవార్డు అయినటువంటి ఆస్కార్ లో తమ సాంగ్ నాటు నాటు ఎంపిక అయ్యినందుకు గాను ఆల్రెడీ ఆ ఈవెంట్ కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. మరి అక్కడకి చరణ్ తో పాటుగా తన భార్య ఉపాసన కొణిదెల కూడా వెళ్లారు.

అయితే వీరిద్దరూ ఈ గ్యాప్ లో తమ బ్యూటిఫుల్ టైం ని ఎంతో ఆనందంగా కూడా గడుపుతూ ఉండగా తమపై కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే వీటిలో ఓ ఫోటో మాత్రం అభిమానుల్లో మరియు సోషల్ మీడియాలో మంచి ఫన్ ని జెనరేట్ చేసింది.

ఉపాసన ముందు నడుస్తూ ఉంటే తన వెనుక తాము షాపింగ్ చేసిన బ్యాగ్ లు అన్నీ చరణ్ పట్టుకొని కనిపిస్తున్నాడు. దీనితో పెళ్ళైన తర్వాత ప్రతి మగవాడి పరిస్థితి ఇంతే అంటూ ఈ ఒక్క పిక్ మాత్రం మంచి వైరల్ గా మారిపోయింది.

సంబంధిత సమాచారం :