తన షోలో తారక్ కే కాల్ ఆప్షన్ తీసుకున్న కంపోజర్స్.!

Published on Nov 6, 2021 12:04 am IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రస్తుతం “ఎవరు మీలో కోటీశ్వరులు” అనే షో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి దీనికి గాను నిన్న దీపావళి స్పెషల్ ఎపిసోడ్ గా గెస్టులుగా మన టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేవి, థమన్ లు కూడా వచ్చారు. మరి ముగ్గురుతో కూడా ఈ ఎపిసోడ్ అదిరే ఎంటర్టైన్మెంట్ తో ముగిసింది.

ఎప్పుడు లేని విధంగా మూడు గంటల పాటు ఈ ఎపిసోడ్ కొనసాగింది. కానీ ఈ షోలో కొన్ని ఫన్నీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. ఓ సమయంలో ప్రశ్నకి గాను వీడియో కాల్ ఆప్షన్ తీసుకోగా అందులో అక్కడే తమ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ నెంబర్ కూడా లాస్ట్ లో కనిపిస్తుంది.

ఇది చూసి వాళ్లంతా ఒకసారే నవ్వేస్తారు. అయితే సరేలే కంప్యూటర్ ని కాల్ కనెక్ట్ చెయ్యమంటే తీరా ఎన్టీఆర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఈ ట్విస్ట్ ఈ షోలో ఆడియెన్స్ కి కూడా మంచి నవ్వులు పూయించింది. ఇలా ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ మంచి ఎంటర్టైనింగ్ గా కొనసాగింది.

సంబంధిత సమాచారం :