హిందీలో ఒక గుడ్ స్టార్ట్ తో మొదలైన “RRR” వసూళ్లు.!

Published on Mar 26, 2022 7:10 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర సెన్సేషన్ ని నమోదు చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం” ఆల్ టైం ఎవరు రికార్డ్స్ తో భారీ వసూళ్ళను అందుకుంటుండగా అన్ని వర్గాల్లో కూడా ఎలాంటి వసూళ్లు ఈ చిత్రం అందుకుంటుంది అనేది అత్యంత ఆసక్తిగా మారింది.

మరి ఎట్టకేలకి ఒక్కో ఏరియా నుంచి సినిమా వసూళ్లు వస్తుండగా హిందీలో ఈ సినిమా ఎలాంటి వసూళ్లు అందుకుంటుందా అని అంతా ఆసక్తిగా చూసారు. అయితే మరీ హై లోకి కాకుండా తక్కువా కాకుండా మంచి నెంబర్ ని అయితే ఈ చిత్రం హిందీ బెల్ట్ లో నమోదు చేసినట్టు తెలుస్తుంది.

మరి లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే ఈ చిత్రం 19 కోట్లు నెట్ వసూళ్లు అందుకుందట. ఇది మంచి స్టార్ట్ అని చెప్పాలి. అలాగే ఇది ఖచ్చితంగా ముందు రోజుల్లో మరింత పెరిగే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు వారు చెబుతున్నారు. మరి చూడాలి ఫైనల్ రన్ లో హిందీ లో ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో అనేది.

సంబంధిత సమాచారం :