ఓటిటి వీక్షకులకు ఈరోజు ట్రీట్..రెండు ఇంట్రెస్టింగ్ సిరీస్ లు.!

Published on Dec 3, 2021 8:00 am IST

నాన్ స్టాప్ గా ఎంటర్టైన్మెంట్ ని అందించే ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ మధ్య కాలంలో మరింత ఎంటర్టైన్మెంట్ కి రంగం సిద్ధం అయ్యింది. అయితే ఈ డిసెంబర్ స్టార్టింగ్ లోనే డిజిటల్ కంటెంట్ లవర్స్ కి ఆసక్తికర ట్రీట్ దక్కుతుంది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థలు అయినటువంటి నెట్ ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలలో ఈరోజు ది బెస్ట్ ఛాయిస్ సిరీస్ లు అందుబాటులోకి ఉండనున్నాయి.

మొదటగా అయితే ప్రైమ్ వీడియోలో మన ఇండియన్ ఇంట్రెస్టింగ్ సిరీస్ “ఇన్ సైడ్ ఎడ్జ్ సీజన్ 3” అందుబాటులోకి రాగా ఈరోజు మధ్యాహ్నం 1:30 సమయంలో నెట్ ఫ్లిక్స్ నుంచి గ్లోబల్ హిట్ “మనీ హెయిస్ట్” చిట్ట చివరి సీజన్ 5 నుంచి రెండో భాగం రిలీజ్ కానుంది. మరి ఈ రెండిటితో కూడా ఇండియాలో ఓటిటి వీక్షకులకు మంచి ట్రీట్ అని చెప్పాలి.

ఇన్ సైడ్ ఎడ్జ్ అయితే క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన వాళ్లకి ఎంతో ఇష్టమైన ఐపీఎల్ బ్యాక్ డ్రాప్ లోనే బెట్టింగ్స్ ఇతర అంశాలతో రసవత్తర డ్రామాతో ఇది ఉంటుంది. ఇంతకు ముందు చూడని వారు అయితే రెండు సీజన్ లు చూసి దీనిని కంటిన్యూ చెయ్యొచ్చు.

సంబంధిత సమాచారం :