“పుష్ప 2” లో కదిలించే సాలిడ్ ఎమోషనల్ ట్రాక్!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాలన్ ఇండియా చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా సినిమా దగ్గర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సీక్వెల్స్ లో ఇది ఒకటి. అయితే ఈ సినిమాపై హైప్ అంతకంతకు ఎక్కువ అవుతూ ఉండగా రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ తో అంచనాలు మరింత ఎక్కువ అయ్యాయి.

అయితే పుష్ప 2 ని మేకర్స్ చాలా పకట్బందీగా ప్లాన్ చేస్తుండగా చాలా హై మూమెంట్స్ తో సినిమాని ప్లాన్ చేస్తున్నారు. అయితే పార్ట్ 1 లో కూడా సాలిడ్ ఎలివేషన్స్ ఉన్నాయి. కానీ సినిమా వర్కౌట్ అవ్వడానికి ఒక్క ఎలివేషన్స్ మాత్రమే సరిపోవు సాలిడ్ ఎమోషన్స్ కూడా కావాలి.

అలాగే పుష్ప 1 లో అమ్మ సెంటిమెంట్, పుష్ప లవ్ ట్రాక్ కానీ అలాగే పుష్ప ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కదిలించాయి. ఇక పార్ట్ 2 లో కూడా సాలిడ్ ఎమోషన్స్ ఉన్నాయట. అయితే ఈసారి ఫ్రెండ్షిప్ ట్రాక్ హైలైట్ గా ఉంటుంది అని తెలుస్తుంది. పుష్ప కి కేశవ పాత్ర మాత్రం మంచి ఎమోషనల్ ట్రాక్ ఉంటుంది అని ఇది డెఫినెట్ గా అందరినీ కదిలిస్తుంది అని తెలుస్తుంది.

మరి చూడాలి పుష్ప 2 ఎలాంటి ట్రీట్ ఇస్తుంది అనేది. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఆగస్ట్ 15న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Exit mobile version