ఆ సినిమా లెక్క లేనన్ని సార్లు చూసానంటున్న హీరో !


పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో హీరోగా పరిచయం అయిన శ్రీ విష్ణు ఆ సినిమా తరువాత అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాల్లోనటించి మెప్పించాడు. తాజాగా ఈ హీరో ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..

తను హీరో వెంకటేష్ కు అభిమానినని, వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా లెక్క లేనన్ని సార్లు చూశానని చెప్పాడు. ఆ సినిమా చూసిన ధియేటర్లోనే నేను నటించిన మెంటల్ మదిలో సినిమా విడుదల అవ్వడం ఆనందమేసిందని ఈ హీరో చెప్పాడు. ప్రస్తుతం నీది నాది ఒకే కథ సినిమాలో నటించిన శ్రీ విష్ణు ఈ సినిమా విజయం పై పూర్తి నమ్మకంగా ఉన్నాడు. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా నాగేశ్వర్ రెడ్డి బొంతల ఎడిటర్ గా పని చేసారు.

Exit mobile version