టాక్..”రాధే శ్యామ్” నుంచి కీలక అప్డేట్ రాబోతోందా?

Published on Jan 5, 2022 8:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా “రాధే శ్యామ్” ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలతో మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన ఈ సినిమాని లాస్ట్ మినిట్ వరకు కూడా మేకర్స్ అనుకున్న డేట్ కే రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యి ఉన్నారు.

అంతెందుకు నిన్నటి వరకు కూడా ఒక క్లారిటీ లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు దేశంలో పరిస్థితులు అన్నీ మారిపోతుండడంతో సినిమా రిలీజ్ పట్ల ఈరోజు కీలక అప్డేట్ ని ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. మరి అది సినిమా వాయిదాకి సంబంధించినదే అని కూడా తెలుస్తుంది. ఒక వివరణ ఇస్తూ మేకర్స్ అధికారిక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయనున్నారట. మరి ఇది ఈరోజు కానీ రేపు కానీ రానున్నట్టు లేటెస్ట్ టాక్. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది.

సంబంధిత సమాచారం :